Coconut For Hair: ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి కారణంగా జుట్టుకు సరైన పోషణ లేక జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనబడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి ముఖ్యమైన పోషకాలలో ప్రోటీన్ మొదటి వరుసలో ఉంటుంది.
జుట్టుకు సరైన ప్రోటీన్ అందకపోతే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. కాబట్టి జుట్టుకు అవసరమైన ప్రోటీన్ అందిస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీనికోసం ఒక రెమిడి తెలుసుకుందాం.
మిక్సీ జార్ లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసి కొంచెం నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ని సపరేట్ చేయాలి. ఒక బౌల్ లో మూడు స్పూన్ల మెంతుల పొడి, ఐదు స్పూన్ల కొబ్బరి పాలు, ఒక స్పూన్ ఆముదము వేసి బాగా కలపాలి.
ఇక చివరిగా ఒక గుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే జుట్టుకు అవసరమైన ప్రోటీన్ అంది జుట్టు కుదుళ్ళు బలోపేతం అయ్యి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.