Summer Drinks:వేసవికాలం ప్రారంభం అయింది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. వేసవిలో వేడి కారణంగా శరీరంలో కూడా వేడి పెరుగుతుంది. శరీరంలో వేడి పెరిగితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పే డ్రింక్ అద్భుతంగా పనిచేస్తుంది.
ఒక నిమ్మకాయను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ సబ్జా గింజలను వేసి నీటిని పోసి నానబెట్టాలి. అలాగే నాలుగు నుంచి ఐదు పుదీనా ఆకులు( Mint leaves ), పావు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్( Black salt ), చిటికెడు మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
ఒక గ్లాసులో నీటిని పోసి పైన తయారుచేసుకున్న మిశ్రమం వేయాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న నిమ్మ ముక్కలు, ఒక స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు, రెండు ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలిపి తాగాలి.
ఈ డ్రింక్ ని తాగితే శరీరంలో వేడిని తగ్గించి చల్లగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి,డిప్రెషన్ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. బాడీ హైడ్రేటెడ్ గా మారుతుంది. వడదెబ్బ బారిన పడకుండా సైతం ఉంటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.