Immunity Booster: గ్లాసు పాలల్లో స్పూన్‌ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే...

Immunity Booster Milk:మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఆరోగ్యంగా ఉంటాం. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.

అలా సమస్యలు రాగానే మనం హాస్పటల్ కి పరుగులు పెడుతూ ఉంటాం. అలా కాకుండా మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకుంటే ఏటువంటి సమస్యలు ఉండవు. చాలా తక్కువ ఖర్చుతో మనం శరీరంలో  రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు. 

ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి ప్రతి రోజు తాగుతూ ఉంటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి సీజనల్ గా  వచ్చే సమస్యలు ఏమీ ఉండవు. అలాగే గ్యాస్, కడుపుబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ పాలు దివ్య ఔషధము అని చెప్పవచ్చు. దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఎముకలను బలపరిచి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు లేకుండా చేస్తుంది కాబట్టి ఈ పాలను వారంలో రెండుసార్లు తాగటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top