WaterMelon:వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ఆహార పదార్థాలు, పండ్లు, పానీయాలు వంటివి చాలా తొందరగా పాడవుతుంటాయి. అందువలన మనలో చాలామంది మార్కెట్ నుంచి పండ్లు తెచ్చిన వెంటనే ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు.
అలా ఫ్రిజ్ లో పెట్టడం వలన కొన్ని పండ్ల రుచి మారి మన ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అటువంటి పండ్లలో పుచ్చకాయ ఒకటి. పుచ్చకాయను పొరపాటున కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఒకవేళ పెడితే ఏమి జరుగుతుందో చూద్దాం.
పుచ్చకాయని ఫ్రిజ్ లో పెట్టడం వలన పోషక విలువలు తగ్గుతాయని... అలాగే పుచ్చకాయను కట్ చేసి ఫ్రిజ్ లో పెడితే బ్యాక్టీరియా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయని కోసి ఫ్రిజ్ లో పెట్టడం వలన ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
వేసవిలో పుచ్చకాయని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.
పుచ్చకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది. పుచ్చకాయలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పుచ్చకాయలో ఉండే విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లు పేగులలో మంచి బాక్టీరియాను పెంచుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.