Ravanasura OTT Release: రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా అనుకున్న సమయం కన్నా ఒక వారం ముందుగానే OTT లో విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ పపర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడినా ... ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చింది.
మొదటి వారంలో కాస్త పరవాలేదనిపించిన ఈ సినిమా రెండో వారం వచ్చేసరికి కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. దాంతో నిర్మాతలు కాస్త తొందరగా ఈ సినిమాను OTT లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మే రెండో వారంలో ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే మే మొదటి వారంలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.