Thati Munjalu:వేసవికాలంలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండల వేడికి ఏటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే వేడిని తగ్గించే ఆహారాలను తీసుకోవాలి. వేసవిలో తాటి ముంజలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
వీటిని తినడం వలన శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. తాటి ముంజలలో విటమిన్ బి, ఐరన్ ,జింక్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
డయాబెటిస్ ఉన్న వారిలో శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పెంచడమే కాకుండా శరీరం డిహైడ్రేషన్ కాకుండా కాపాడి నీరసం, నిస్సత్తువ లేకుండా చేస్తుంది. వీటిలో క్యాలరీలు తక్కువగాను నీటి శాతం ఎక్కువగాను ఉండటం వలన ఎక్కువసేపు ఆకలి వేయదు కాబట్టి బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
అలాగే వీటిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియను బాగా చేస్తుంది. వేసవిలో వచ్చే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. చెమట పట్టడం, చర్మం ఎర్రబడటం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది .
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.