Drinking Too Much Tea: మనలో చాలా మంది ఉదయం లేవగానే టీ తాగుతూ ఉంటారు. టీ తాగనిదే ఏ పని ముందుకు వెళ్లదు. అయితే టీ ని లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. అదే ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
టీ ని ఎక్కువగా తీసుకోవడం వలన వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. టీ ఆకులలో సహజసిద్ధంగా కెఫిన్ ఉంటుంది. కెఫీన్ ఎక్కువ మోతాదులో తీసుకోవటం వలన ఒత్తిడి, ఆందోళన కలిగి తలనొప్పి, కండరాల ఒత్తిడి రావడంతో మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
రోజులో 200 ఎంజి కంటే ఎక్కువ మోతాదులో కెఫెన్ తీసుకోకూడదు. నిద్రలేమి సమస్య కూడా వస్తుంది. టీ ఎక్కువగా తాగటం వలన జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. మన శరీరం ఆహారంలో ఉన్న పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
టీ లో ఉండే టానిన్లు మన శరీరం ఇనుమును గ్రహించకుండా చేస్తాయి. అప్పుడు ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత సమస్య అనేది వస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో టీ తాగితే గ్యాస్, కడుపుబ్బరం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. గర్భధారణ సమయంలో కూడా టీని చాలా లిమిట్ గా తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.