Best Oils In Cooking :వంటలలో వాడటానికి అనేక రకాల నూనెలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో రైస్ బ్రాండ్ ఆయిల్,సన్ ఫ్లవర్ ఆయిల్,ఆవ నూనె,వేరుశనగ నూనె,కొబ్బరి నూనె,ఆలివ్ ఆయిల్ మొదలైనవి ఉన్నాయి. ఇప్పుడు మనం వంటలలో ఏ నూనె వాడితే మంచిదో తెలుసుకుందాము.
రైస్ బ్రాండ్ ఆయిల్ దీనిని తవుడు నూనె అని కూడా అంటారు. దీనిలో సహజసిద్దంగా ఉండే విటమిన్ ఇ కొలస్ట్రాల్ ను నియంత్రించటానికి దోహదం చేస్తుంది. గుండె జబ్బులకు కారణమయ్యే కొలస్ట్రాల్ ను అదుపు చేసే శక్తి దీనికి ఉండుట వలన హృద్రోగులు దీనిని వాడాలని నిపుణులు చెప్పుతున్నారు.
దీన్ని వాడటం వలన రోగ నిరోధక శక్తి పెరుగటమే కాకుండా క్యాన్సర్ రాకుండా అడ్డుకొంటుంది. అలాగే దీన్ని ఉపయోగించటం వలన చర్మం మృదువుగా సహజ సౌందర్యంతో మెరుస్తూ ఉంటుంది.
సన్ ఫ్లవర్ ఆయిల్ దీనిలోని లినోలిక్ ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ప్రతి రోజు 10 నుంచి 15 గ్రాముల నునెను ఆహార పదార్దాల తయారీలో ఉపయోగిస్తే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు. ప్రతి రోజు ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే అధిక బరువు తగ్గించుకోవచ్చు. అంతేకాక రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీనిలో లభించే మినరల్స్ కీళ్ళనొప్పులు,వాపులను తగ్గించటానికి దోహదం చేస్తాయి.
ఆలివ్ ఆయిల్ ఆరోగ్యపరంగా గాని,సౌందర్య పరంగా గాని దీని వాడకం ఇటీవలి కాలంలో ఎక్కువ అయింది. దీనిలో యాంటిఆక్సిడెంట్ ఎక్కువగాను,కొలస్ట్రాల్ తక్కువగాను ఉంటుంది. పొట్ట తగ్గించు కోవాలని అనుకునే వారికీ దివ్య ఔషదంగా పనిచేస్తుంది.
వేరుశనగ నూనె దీన్ని వంటల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనిని వాడటం వలన శరీరంలో చేడు కొలస్ట్రాల్ దరిచేరదు. దీనిలో యాంటి ఆక్సిడెంట్స్,విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. క్యాన్సర్,గుండె జబ్బులు,అల్జీమర్స్ వంటి వ్యాదులతో సమర్దవంతముగా పోరాడుతుంది. దీనిని రోజు వారి వంటలో ఎంత ఉపయోగించాలో నిపుణుల సలహా తీసుకోవాలి.