చిన్న వయస్సు నుంచే తీసుకొనే ఆహారం మీద శ్రద్ద పెడితే ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా గుండె సంబందిత సమస్యలను నియంత్రణలో ఉంచుకోవటానికి కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి.
తృణ దాన్యాలు
వీటిలో పీచు అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో హాని చేసే కొవ్వులను కరిగిస్తాయి. హృదయానికి రక్త సరఫరా సక్రమంగా అందేలా చూస్తాయి. దాంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ముఖ్యంగా ఓట్స్, బార్లి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది.
ఎండుద్రాక్ష
ఎండుద్రాక్ష లో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిని రోజుకు 5 నుంచి 10 వరకు తీసుకోవటం వలన శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోతాయి. గుండె పనితీరును సక్రమంగా ఉంచటానికి ఇవి బాగా సహాయపడతాయి.
టమోటా
విటమిన్ సి సమృద్దిగా ఉండే కాయగురల్లో టమోటా ఒకటి. దీనిలో ఉండే లైకోపిన్ అనే పదార్ధం శరీరంలోకి వెళ్ళాక అది విటమిన్ గా, మినరల్ గా మారి జీవక్రియ రేటును పెంచుతుంది. అంతేకాక గుండె కవాటాల పనితీరును మెరుగుపరుస్తుంది.
అరటిపళ్ళు
వీటిని తీసుకోవటం వలన శరీరానికి సోడియం,పొటాషియం కావలసిన మోతాదులో అందుతుంది. పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేల చూస్తుంది.