Liver Care :లివర్ అనేది జీవక్రియల్లో కీలకమైన పాత్రను పోషించటమే కాకుండా శరీరానికి అవసరమైన శక్తిని తయారుచేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అలాగే జీవక్రియలో :కూడా లివర్ ది కీలకమైన పాత్రే.
అంతేకాక శరీరంలో పేరుకున్న వ్యర్ధాలను ఎప్పటికప్పుడు బయటకు పంపటం,వ్యాధినిరోధక శక్తిని పెంచటం మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి లివర్ కీలమైన పాత్రను పోషిస్తుంది.అటువంటి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.
బీట్‌రూట్‌ను ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే లివర్ లో కణాలు తిరిగి నిర్మాణమవుతాయి. మధుమేహం ఉన్నవారు బీట్‌రూట్ తినాలి. లివర్ ఆరోగ్యంగా పదిలంగా ఉంటుంది.
ఆపిల్ లో ఫైబర్ మరియు పెక్టిన్ సమృద్ధిగా ఉండుట వలన లివర్ పనితీరును మెరుగుపరచటమే కాకుండా లివర్ సక్రమంగా విధులు నిర్వహించేలా చేస్తుంది.
వెల్లులిని ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వెల్లుల్లిలో ఉండే లక్షాణాలు లివర్ ని శుభ్రం చేస్తాయి. దాంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
లివర్ ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. ఆలివ్ ఆయిల్ లో ఉండే లక్షణాలు లివర్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి కాస్త ఖరీదు ఎక్కువైనా ఆలివ్ నూనె వాడటం మంచిది.
తృణ ధాన్యాలలో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే లివర్ పనితీరు బాగుండటమే కాకుండా లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.