చెమట వలన కొందరికి చెప్పుకోలేని సమస్యలు వస్తాయి. వారు నలుగురిలో స్వేచ్చగా తిరగలేరు. వేడి వాతావరణంలో వారు నలుగురితో కలిసి పనిచేయ లేరు. శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు రావటం వలన డీ హైడ్రేషన్ గురి అవుతారు. కొన్ని రకాల వస్తువులకు దూరంగా ఉండుట వలన కొంత మానసిక ఆనందం దూరం అవుతుంది.
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండా మన ఇంటిలో కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.
టమాటా జ్యూస్
తాజా టామాటో జ్యూస్ కూడా చెమటకు బాగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ టామాటో జ్యూస్ క్రమం తప్పకుండా కొన్ని వారాల పాటు త్రాగితే మంచిపలితాన్ని పొందవచ్చు.
బంగాళా దుంప
సాదారణంగా చేతుల కిందే ఎక్కువ చెమట పడుతుంది. బంగాళా దుంప ముక్కను చెమట పట్టే ప్రాంతంలో సున్నితంగా మర్దన చేయుట వలన చెమట సమస్య నుండి బయట పడవచ్చు. మొక్కజొన్న పిండి,వంటసోడా రెండు సమానంగా తీసుకోని చేతుల కింద రాసి ఆరిన తర్వాత స్నానం చేస్తే మంచి పలితం కనపడుతుంది.
వీట్ గ్రాస్ జ్యూస్
అధిక చెమటకు ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. లేత గోధుమ గడ్డిని జ్యూస్ లా చేసుకొని రోజు ఒక కప్పు త్రాగాలి.
ఆహారం
చెమట ఎక్కువగా పట్టేవారు కొవ్వు ఎక్కువుగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. బీన్స్,క్యారట్,బఠాని వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
స్నానం
స్నానం చేసే నీటిలో నిమ్మతోక్కలు వేసుకొని స్నానం చేస్తే మంచిది. అలాగే స్నానం చేసే నీటిలో దానిమ్మ ఆకులు వేసిన చెమట నుండి తప్పించుకోవచ్చు.