Fenugreek Benefits in telugu :కూరల్లో వేసిన...పప్పులా చేసిన మెంతి రుచే వేరు. ఆరోగ్యానికి మంచి చేయటంలో కూడా ముందు ఉంటుంది. వారంలో మెంతికూరను రెండు,మూడు సార్లు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మెంతికూరలో ఇనుము సమృద్దిగా ఉంటుంది.
రక్తహినత ఉన్నవారు తరచుగా తీసుకుంటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. మదుమేహం ఉన్నవారు మెంతికూరను తీసుకోవచ్చు.
ప్రతి రోజు మెంతి రసం తీసుకుంటే శరీరంలో మేలు చేసే హార్మోన్స్,ఇన్సులిన్ శాతం అదుపులోకి వస్తుంది. ఈ కార్లో విటమిన్ కె ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం గడ్డకట్టటానికి పనికివస్తుంది. మలబద్దకం ఉన్న పిల్లలకు తరచుగా ఈ కూరను తినిపిస్తే మంచిది. ఇందులో పీచు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.