Rice Flour Sweet puri:రైస్ ఫ్లోర్ తో స్వీట్ పూరి.. పండగలొచ్చాయంటే కాస్తా వెరైటీస్ గాని,స్వీట్ స్పెషల్స్ కోసం గాని వెతుకుతూ ఉంటాం. ఇంట్లో ఉండే బియ్యం పిండి ,బెల్లంతో స్వీట్ పూరిలు చేసి చూడండి.ఎంత స్పెషల్ గా ఉంటాయో.
కావాల్సిన పదార్ధాలు
బియ్యం పిండి – 1 కప్పు
బెల్లం – ½ కప్పు
కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – ½ టీ స్పూన్
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని బెల్లం నీళ్లను వేసి వేడి చేసుకోవాలి.
2.బెల్లం పాకం తయారైతున్నప్పుడు యాలకుల పొడి ,కరిగించిన నెయ్యి ,కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి మార్చుకోని బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి.
4.మిక్స్ చేసుకోని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
5.కొద్దిగా గోరు వెచ్చగా ఉండగానే కొద్దిగా నీళ్లు చల్లుకోని మెత్తగా కలుపుకోవాలి.
6.కొద్ది కొద్ది పిండి ముద్దలను తీసుకోని పూరిలా వత్తుకోవాలి.
7.డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి వత్తుకున్న పూరీలను బాగా ఫ్రై చేసుకోవాలి.
8.క్రిస్పిగా అయ్యే వరకు వేపుకుంటే స్వీట్ పూరీలు రెడీ.