స్నాక్స్ లో కారప్పూస అందరికీ ఇష్టమే. ఇందులో ఏమీ కనిపించవు కానీ flavours మాత్రం తెలుస్తూ ఉంటాయి. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయె కారప్పూస... ఎలాగో చూడండి.
కావలసినవి:
బియ్యప్పిండి, ,శనగపిండి ,వాము, జీలకర్ర ,పచ్చిమిరపకాయలు, అల్లం, వెన్న ,పసుపు ,ఉప్పు.
చేసే విధానం:
ఒక మిక్సీ జార్ లో ఒక టేబుల్ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ,రెండించుల అల్లం ముక్క, 10 పచ్చిమిర్చి మిరపకాయలు, చిటికెడు పసుపు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి.
మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేయండి. అంతా జారుగా వస్తుంది కదా, అప్పుడు దాన్ని వడ కట్టుకోవాలి. ఈ వడకట్టిన వాటర్ తో పిండిని కలుపుకుంటే flavours అన్నీ కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం వాటర్ ని వడకట్టుకోండి.
ఇప్పుడు ఒక ప్లేట్ లో రెండు కప్పుల బియ్యప్పిండి, రెండు కప్పుల శనగపిండి తీసుకోండి. ఒకసారి జల్లెడ వేసుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, పావు కప్పు వెన్న వేసుకొని పిండి అంతా కలపెట్టి ,ఇప్పుడు వడకట్టిన వాటర్ తోటి పిండినంత కలుపుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల ,కారప్పూస గుత్తిలోకి ఏమి అడ్డు రాకుండా చక్కగా సాఫ్ట్ గా మురుకులు ఒత్తుకోవచ్చు .
పిండిని సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి ,అటు గట్టిగా , ఇటు పల్చగానే ఉండకూడదు. ఒక గుత్తికి సరిపడా పిండిని పక్కన పెట్టుకొని మిగతా పిండిని ఒక తడి cloth పైన కప్పుకోండి. ఆరిపోకుండా. ఇప్పుడు ఈ ముద్దతో లావు కారపూస, సన్న కారప్పూస చేసుకోవచ్చు . కావాల్సిన ప్లేట్ పెట్టుకొని వేసుకోవచ్చు.
ఈ మురుకులు గొట్టం తీసుకొని దానికి లోపల భాగమంతా నూనెతో గ్రీస్ చేసుకొని దానికి సరిపడా ముద్దని పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. డీప్ ఫ్రై కి సరిపడా నూనె పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా నూనెను కాగనించుకొని, మురుకులు ఒత్తుకోవాలి. బాండికి సరిపడా మురుక్కుని ఒత్తుకోవాలి. నూనె నురుగు ఆరిన తర్వాత జంతికనే తిప్పుకోవాలి .వేసిన వెంటనే కలపకూడదు. ఇప్పుడు వెన్నెలా కరిగిపోయే కారప్పూస మీ ముందుంటుంది.