ఆకు వడలు లాగానే ఒత్తుకొని మిరియాలు add చేయడం వల్ల ఇవి ఘాటుగా, క్రిస్పీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి.
కావలసినవి:
మినప గుళ్ళు, బియ్యప్పిండి, మిరియాలు, ఉప్పు ,వెన్న.
చేసే విధానం:
ఒక పాన్ లో నూనె లేకుండా పావు కప్పు మినప గుళ్ళు వేయించుకోండి. కమ్మని వాసన వచ్చేవరకు వేపుకొని చల్లార పెట్టుకోండి. చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్లో మెత్తని పొడి చేసుకోండి. ఒక వెడల్పాటి plate తీసుకొని ఈ పిండిని జల్లెడ పట్టుకోవాలి. దీంట్లో రెండు కప్పుల బియ్యం పిండి కూడా వేసి కలుపుకోవాలి.
రెండు టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని మిక్సీలో అయినా రోటిలో అయినా కొంచెం పలుకులు ఉండేలా దంచుకోవాలి .దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మరొకసారి దంచుకోవాలి. పావు టీ స్పూన్ ఇంగువ ,రెండు స్పూన్లు వెన్న వేసి బాగా వెన్న తడి ఉన్నంత కలుపుకొని, మరికొంచెం నీళ్లు పోసుకుని ముద్ద అయ్యేలా కలుపుకోవాలి .
చెక్కలు చేయటానికి వీలుగా ఉండేలా ఉండాలి .batter ముద్దగా ఉండాలి, అంటుకోకుండా ఉండాలి ,కొంచెం ముద్ద పక్కన పెట్టుకొని మిగతాది తడి బట్ట వేసి ఆరకుండా చూసుకోవాలి. ఒక పాలిథిన్ కవర్ కి ఆయిల్ గ్రీస్ చేసుకొని చిన్న చిన్న వడలు చేసి, తడి బట్ట మీద ఆరబెట్టుకోండి. మూకుడు నిండా నూనె తీసుకుని సరిపడా వడలు చేసిన తర్వాత వాటిని మీడియం ఫ్లేమ్ లో వేగించుకోవాలి. క్రిస్పీగా మిరియాల వడలు రెడీ......