Flax Seeds:రోజుకి 1 స్పూన్ గింజలను తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు ఎన్నో...?



Flax seeds : మన పూర్వీకులు అవిసె గింజలను చాలా ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే ఈ మధ్యకాలంలో వీటిని వాడటం చాలా తగ్గించేశారు. ఇప్పుడు వీటి ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా అవిసె గింజలను తింటారు. 

అవిసె గింజలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ బి1, కాప‌ర్‌, మాంగ‌నీస్‌, మెగ్నిషియం, పాస్ఫ‌ర‌స్‌, జింక్‌, సెలీనియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అంతేకాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు అవిసె గింజలను డైట్ లో భాగంగా చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

చేపలు తినని వారికి అవిసె గింజలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే చేపలతో సమృద్ధిగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఈ అవిసె గింజల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను బాగా జరిగేలా ప్రోత్సహిస్తాయి.

అవిసె గింజ‌లలో కొలెస్ట్రాల్‌ తగ్గించే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గించే గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని నియంత్రణలో ఉంచటంలో బాగా సహాయపడుతుంది. ప్రతి రోజు అవిసె గింజలను ఆహారంలో భాగంగా చేసుకుంటే రోజంతా
అలసట లేకుండా ఉత్సాహంగా ఉంటారు.

మహిళలు ప్రతి రోజు అవిసె గింజలను ఆహారంలో భాగంగా చేసుకుంటే హార్మోన్స్ సమతుల్యం సరిగా ఉండి హార్మోన్స్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గింస్తుంది.

ప్రతి రోజు అవిసె గింజలను తినటం వలన మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తి బాగుంటుంది. అంతేకాక మానసికంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతత కలుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top