Ragi Roti:ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ రెసిపీ రాగి రొట్టె. రాగుల ఉపయోగాలు అందరికీ తెలిసిందే. జావ లాగా తాగొచ్చు, ఉప్మా, దోస తెలిసినవి కదా అలాగే ఈ హెల్తీ రెసిపీని రొట్టెలు లాగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి తింటే స్నాక్ లాగా చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి.
కావలసినవి:
రెండు కప్పుల రాగి పిండి, రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ,కొంచెం నూనె.
చేయు విధానం:
రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలు, రెండు పచ్చి మిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేయాలి. పేస్ట్ అవ్వకుండా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ కానీ ఒక బేసిన్ గాని తీసుకొని ఈ మిక్సీ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి పైన రెండు కప్పుల రాగి పిండిని వేసుకోవాలి.
నీళ్లు పోయకుండా ఉల్లిపాయ తేమ ఎంత వరకు కలిస్తే అంతవరకు కలుపుకోవాలి. రాగి పిండి అంటే హెల్తీ కాబట్టి మనం ఇంకా హెల్తీ ప్రొడక్ట్స్ ఏమైనా మునగాకు కానీ ఆకుపచ్చని వెజిటేబుల్స్ ఏవైనా కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ కరివేపాకు యాడ్ చేశాము ఇక్కడ ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పట్టవు.
ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ లో ఉన్న తేమతో కలిపేసాం.. కాబట్టి కొంచెం వాటర్ పడతాయి. చూసుకుంటూ చపాతీ పిండి మీద ఇంకొంచెం సాఫ్ట్ గా ఉండేలాగా కలుపుకోవాలి. ఒక్క పావుగంట మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అది ఇంకొంచెం వాటర్ observe చేసుకుని కొంచెం గట్టిపడుతుంది .
చపాతి ముద్ద మీద ఇంకొంచెం ఉండేలాగా తీసుకోండి. రెండు కప్పులకి సుమారు ఒక ఆరు ముద్దలు అయ్యేలాగా చూసుకొని, ఒక తడిపిన క్లాత్ నీళ్లు అన్ని పిండేసి దాని మీద మనం ఈ ముద్దని పెట్టి ఒత్తుకోవాలి. ఒత్తుకొనేటప్పుడు spread అవ్వడానికి లైట్ గా మనం చేతిని తడి చేసుకోవచ్చు.
ఒక పాన్ తీసుకొని వత్తిన రొట్టెని దాని మీద పెట్టి మూత పెట్టి low flame మీద పచ్చి కాలేవరకు ఉంచుకోండి. కొంచెం తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు కొంచెం ఆయిల్ apply చేసి మరొకవైపు వెనక్కి తిప్పి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చి రుచి రుచిగా కరకరలాడే రాగి రొట్టెలు తింటూ ఎంజాయ్ చేయండి.