Chia Pudding :ఈ రోజు ఒక ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ గురించి మనం తెలుసుకుందాం. పొద్దు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకునే టైం లేని వాళ్ళకి, ప్రొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ తినలేని వాళ్ళకి, ఇంకా జర్నీస్ లో , వర్కింగ్ పర్సన్స్ కి కూడా ఉపయోగపడుతుంది.
మనం తీసుకునే ఫుడ్ తో పాటు ఎటువంటి క్యాలరీస్ లేకుండా, వెయిట్ లాస్ కి ఉపయోగపడే ఒమేగా త్రీ fatty acids తో ఇంకా ప్రోటీన్స్ తో నిండినటువంటి హెల్దీ ఫుడ్. ఆరోగ్యంగా పోషకాలు అందుకుంటూ బరువు తగ్గేవారికి ఈ chia pudding చాలా ఉపయోగపడుతుంది.
కావలసిన పదార్థాలు
రెండు కప్పుల కొబ్బరి ముక్కలు.1.25 కప్పు వాటర్ ,8 స్పూన్లు చియా సీడ్స్ ,రెండు స్పూన్లు తేనె ,మూడు డేట్స్ ,ఇంకా టాపింగ్స్ ఏ సీజన్ కి ఆ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ వాడుకోవచ్చు. ఆపిల్, Melon, papaya,mango ఇంకా ఏవైనా సిట్రస్ కానీ పండ్లు అయితే బాగుంటాయి. ఇలా మన ఇష్టం. రోస్టెడ్ నట్స్ బాదం అవి క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటాయి కాబట్టి.
తయారు చేయు విధానం:
రెండు కప్పుల కొబ్బరి ముక్కలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఒక బ్లెండర్ జార్ లో వేసి ఒక కప్పు వాటర్ తో హై స్పీడ్ లో బ్లెండ్ చేస్తే చిక్కగా షేక్ అవుతుంది. Blend అయిన తర్వాత వాటిని ఒక మెస్సిలిన్ క్లాత్ తొ వడకట్టాలి.
ఇది ఫస్ట్ extract అంటారు. చాలా పాలు చిక్కగా వస్తాయి. ఆ తర్వాత మళ్లీ కొంచెం వాటర్ వేసి తిప్పిన తర్వాత ఇది second extract. ఈ పాలు సుమారు మనకి ఒక 500 ml ఆవుతాయి.
ఈ పాలతో ఇంకా మనం ఫలావ్ లాంటివి కూడా చేసుకోవచ్చు. ఈ పాలలో 20gms or 8 spoons చియా సీడ్స్ వేసుకొని బాగా కలపాలి. ఎక్కడ గడ్డలు లేకుండా స్మూత్ గా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల తేనె వేసి ఇంకా కలపాలి. తర్వాత మూడు ఖర్జూరాలని బాగా కట్ చేసుకుని వాటిని కూడా వేసి కలపాలి.
వీటిని ఒక గ్లాస్ జార్ లో తీసుకొని రాత్రంతా ఫ్రిజ్లో పెట్టేసి ఉంచుకోండి. ఓవర్ నైట్ ఉంచిన చియా మార్నింగ్ మనం చూసేసరికి చాలా అట్రాక్టివ్ గా నాని బాగా ఉబ్బి ఉంటాయి. ఇప్పుడు మనకు ఇష్టమైన టాపింగ్స్ వేసుకోవచ్చు .
సిట్రస్ ఫ్రూట్స్ కాకుండా ఏ ఫ్రూట్ అయినా ఆపిల్, papaya, melon ఏవైనా slices కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ ,రోస్టెడ్ డ్రైఫ్రూట్స్ కూడా sprinkel చేసుకుంటే క్రంచి క్రంచిగా ఉంటాయి .