Egg masala pulusu:రాయలసీమ స్పెషల్ పులుసు .eggs హెల్దీ తెలిసిందే కదా పులుసులో వేసుకుంటే కర్రీ ఎక్కువ అవుతుంది ,టేస్ట్ గా కూడా ఉంటుంది. గ్రేవీ కర్రీస్ పిల్లలకు పెట్టడం చాలా సులువు కదా.. ఇలా పెట్టి చూడండి తింటారు.
కావలసినవి:
నాలుగు బాయిల్డ్ ఎగ్స్ , నాలుగు పచ్చిమిర్చి , ఒక పెద్ద ఉల్లిపాయ , ఒక పెద్ద టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ,ధనియాల పొడి, ఉప్పు ,కారం ,గరం మసాలా పొడి, నిమ్మకాయంత చింతపండు, బెల్లం
చేసే విధానం:
స్టవ్ వెలిగించి ఒక బాండీలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో పావు చెంచా పసుపు వేసి నాలుగు ఆఫ్ బాయిల్డ్ ఎగ్స్ వేసి ఫ్రై చేయాలి. ఇంకో కళాయిలో అరకప్పు ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి ,నాలుగు పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు వేసి పచ్చివాసన పోయే వరకు fry చేసుకోవాలి.
వాసన పోయిన తర్వాత salt సరిపడినంత, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రెండు పెద్ద టమాటో ముక్కలు వేసి వాటిని కూడా fry చేయండి .నూనె పైకి తేలే వరకు fry చేసి టమాటాలు మెత్తగా blend చేసుకొని, పావు చెంచా మెంతులు ,పావు చెంచా చింతపండు పులుసు వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి.
ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కాసేపు మూత పెట్టి ఉంచండి. 300 ml వాటర్ పోసుకొని బాగా కలిపి low flame మీద మూత పెట్టాలి.
నూనె పైకి తేలే వరకు చూసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకోండి . టేస్ట్ గా ఉంటుంది మీకు అవసరం లేకపోతే skip చేయొచ్చు .ఇప్పుడు Toss చేసుకున్న eggs కూడా దాంట్లో వేసి మరి కొంచెం సేపు ఉడకనిచ్చి ఒక అర కప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.