Bitter Gourd Curry: కాకరకాయ అంటే బాబోయ్ చేదు అనిపిస్తుంది. కానీ చేదు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మన బాడీలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే పోతాయి. అందుకే అప్పుడప్పుడు మన బాడీకి చేదు కూడా అవసరం ఉంటుంది. కానీ చేదుగా తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేసుకొని చూడండి రెసిపీ Taste గా ఉంటుంది. చేదు ఉండదు.
కావలసినవి:
పావు కిలో ఉల్లిపాయలు ,400 గ్రాముల లేత కాకరకాయలు, రెండు టీ స్పూన్లు కారం, 5 వెల్లుల్లి రేక లు, ఒక స్పూన్ జీలకర్ర, ఉప్పు తగినంత, ఒక స్పూన్ పసుపు,
చేయు విధానం:
400 గ్రాముల లేత కాకరకాయలు తీసుకొని లైట్ గా ఫీల్ ఆఫ్ చేసుకోండి. రెండు ఇంచు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కాయలకు పట్టించి. ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి . తర్వాత బాగా నీరు రావడం గమనించండి. ఒక్కొక్క కాకరకాయ తీసి బాగా పిండితే ఆ రసంతో చేదు దిగిపోతుంది.
ఒక మిక్సీ జార్ తీసుకొని పావు కిలో ఉల్లిపాయ తరుగు, రెండు స్పూన్లు కారం, 5 వెల్లుల్లి రేఖలు ,ఒక టీ స్పూన్ జీలకర్ర ,కొంచెం ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బాండీలో పావు కప్పు నూనె తీసుకొని ఈ కాకరకాయల్ని తిప్పుతూ దోరగా వేయించుకోవాలి.
ఇప్పుడు సగం ఫ్రై అయిన కాకరకాయల్లో గింజలు తీసేసి ఉల్లికారం స్టఫ్ పెట్టాలి. స్టఫ్ పెట్టిన కాకరకాయల్ని మళ్ళీ ఒక బాండీలో కొంచెం నూనె వేసి మిగిలిన ఉల్లికారం అంతా కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి 20 నిమిషాలు వేయించుకోండి.
సపరేటుగా కాయల్ని ఫ్రై చేసి ఉల్లికారం స్టఫ్ గా కూడా పెడతాము. ఇలా కూడా ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది. చేదు కూడా ఉండదు. సూపర్ గా టేస్టీగా ఉంటాయి.