Telugu Vantinti Chitkalu : వంకాయలు ముడతలు పడకుండా వుండాలి. మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. తొడిమ ఆకుపచ్చరంగులో, తోలు నిగనిగ లాడుతూ వుండాలి. పుచ్చులు లేకుండా చూడాలి.
బంగాళా దుంపలు గట్టిగా వుండాలి. పై పొర తీసినప్పుడు లోపలిభాగం లేత పసుపు పచ్చని రంగులో వుండాలి. బంగాళా దుంప పైన నల్లటి మచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు వున్నట్లయితే వాటిని పొరపాటున కూడా కొనవద్దు, దుంపల పైన గుంటలు లేకుండా నున్నగా వుండేవి చూసి కొనండి.
అల్లం మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. ముదురు రంగులో వున్న అల్లం చూసి కొనాలి. అల్లం పై పొర తీసి వాసన చూసి దాని ఘాటును బట్టి అల్లాన్ని అంచనా వేయాలి.
ఉల్లి పాయలు గట్టిగా వున్నవి మాత్రమే కొనాలి. ఉల్లిపాయ పై పొరలో తేమ వుంటే అసలు కొనవద్దు.