Beauty Tips : చేతులు అంతా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. కానీ మోతులును చూస్తే నల్లగా చాలా ఇబ్బందికరంగా మరియు అసహ్యంగా ఉంటాయి. వాటిని దాచుకోవడానికి ప్రతిసారీ పొడవు చేతుల డ్రెస్ లు వేసుకోలేం. మరి దాని కోసం ఏం చేయాలి.
ఎంత ప్రయత్నించినా.. ఎన్ని చిట్కాలను ఫాలో అయినా.. మోచేతుల నలుపు మాత్రం తగ్గడం లేదని చాలా మంది డీలా పడిపోతూ ఉంటారు. అయితే మీకు సులభంగా, ఎఫెక్టివ్ గా మంచి రిజల్ట్ తీసుకొచ్చే అద్భుతమైన ట్రీట్మెంట్స్ మీ వంటింట్లో దాగి ఉన్నాయి.
కానీ ఒక సారి రెండు సార్లు ప్రయత్నిస్తే సరిపోదు. అలాగని.. ఎప్పుడో ఒకసారి ప్రయత్నించినా ఫలితం కనపడదు. కాబట్టి.. రెగ్యులర్ గా.. ఇక్కడ చెబుతున్న సులభమైన చిట్కాలను ట్రై చేయండి.. మీ మోచేతులు.. మిలమిల మెరిసిపోతాయి.

తేనె, గంధం
గంధం పొడి, తేనె మిశ్రమాన్ని కలిపి.. రెండు వారాలకు ఒకసారైనా మోచేతులకు అప్లై చేయండి. ఖచ్చితంగా ఈ ప్యాక్ మీ మోచేతులపై మృత కణాలను తొలగించి .. ఆరోగ్యకరమైన , గ్లోయింగ్ చర్మాన్ని అందిస్తుంది.
పెరుగు, శనగపిండి
శనగపిండి, పెరుగు కలిపి.. మోచేతులకు రాసుకుని అర గంటపాటు ఆరనివ్వాలి. కొన్ని రోజుల్లోనే తేడా మీకు కనిపిస్తుంది. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది.