కావలసినవి:
పావు కప్పు జీడిపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ, మూడు పచ్చిమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ,ఒక స్పూన్ జీలకర్ర పొడి ,ఒక స్పూన్ ధనియాల పొడి ,ఒక స్పూన్ కారం , సాల్ట్ తగినంత, ఒక స్పూన్ గరం మసాలా ,ఒక పెద్ద టమాటో, రెండు కప్పుల పెరుగు ,పావు కేజీ పన్నీర్ క్యూబ్స్, గార్నిష్ కి ఫ్రెష్ క్రీమ్, తరిగిన కొత్తిమీర, నెయ్యి.
చేయు విధానం:
పాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, పావు కప్పు జీడిపప్పు వేసి గోల్డ్ కలర్ లో వేగించుకోవాలి. .మళ్లీ రెండు స్పూన్ల ఆయిల్ కానీ ,బట్టర్ కానీ ,నెయ్యి కానీ వేసి, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేపాలి. మంచి texture కోసం మీడియం ఫ్లేమ్ లో కొంచెం టైం తీసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.
సగం వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి పొడవుగా cut చేసి వేయాలి .ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి paste, ఒక టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ ,ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ పసుపు వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేవరకు బాగా వేగనివ్వాలి.
ఆ తర్వాత అందులోనే ఒక పెద్ద టమాటో ప్యూరి కూడా వేయాలి. రెండు నిమిషాలు వేగిన తర్వాత 150 ml water పోయాలి. బాగా చిక్కబడనివ్వాలి, చిక్కబడుతూ ఉండగా రెండు కప్పులు పెరుగు వేయాలి, పెరుగు బాగా కలిసే వరకు కలపాలి ,250 g పనీర్ క్యూబ్స్ కూడా వేయాలి.
ప్రైడ్ కాజు కూడా వేసి బాగా కలుపుకోవాలి ,పనీర్ వేగించకుండా వేయటం వల్ల flavours బాగా వాటికి పడతాయి. రెండు మూడు నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, రెండు టేబుల్ స్పూన్ ఫ్రెష్ కొత్తిమీర తరుగు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, కూర నుంచి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచితే డాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ రెడీ.