ముప్పై సంవత్సరాలు దాటినా తర్వాత చర్మం తన సహజ సౌందర్యాన్ని కొద్ది కొద్దిగా కోల్పోవటం ప్రారంభం అవుతుంది. నలబై సంవత్సరాల తర్వాత చర్మం తన సహజ కాంతిని మరింత కోల్పోతుంది. ఇలాంటి సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి.
నలబై సంవత్సరాల తర్వాత కూడా చర్మం మెరుస్తూ,ఆరోగ్యవంతముగా ఉండటానికి కొన్ని సూచనలు తెలుసుకుందాము.
మార్కెట్ లో లభ్యమయ్యే సౌందర్య సాధనాలను ఈ వయస్సు వారు ఉపయోగించకుండా ఉంటే మంచిది. తప్పనిసరిగా ఉపయోగించ వలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా బ్యూటిషియన్ సలహా తీసుకోవాలి.
పొడి చర్మం కలవారు మేకప్ కి దూరంగా ఉండాలి. పౌడర్స్ వంటి వాటిని తక్కువగా ఉపయోగించాలి. స్నానానికి సబ్బులు,లోషన్స్ కాకుండా శనగపిండి లేదా సున్నిపిండిని మాత్రమే వాడాలి.
కంటి క్రింద, నోటి దగ్గర చర్మం ముడతలు పడినట్టైతే, రెండు స్పూన్స్ చక్కేరలో ఆలివ్ ఆయిల్ కలిపి కంటి క్రింద, నోటి దగ్గర అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.
ఒక స్పూన్ తేనెలో గుడ్డు తెల్ల సొనను కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి,మెడకు పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
బొప్పాయి గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.