Black Spots Home remedies:ముఖారవిందాన్ని దెబ్బతీసే వాటిల్లో మచ్చలదే ప్రధమ స్థానం. టీనేజి అమ్మాయిల దగ్గర నుండి అంటీల వరకు అందరూ దీని బాధితులే. దీని నుండి తప్పించుకోవటానికి,పూర్వపు సౌందర్యాన్ని పొందటానికి రకరకాల పద్దతులను పాటిస్తారు.
అంతకన్నా ఎక్కువగా మందులు,క్రీమ్స్,లోషన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వీటి అన్నింటి కన్నా ఆహారంతో వీటి బారి నుండి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఆహారం ద్వారా పూర్తి స్థాయిలో తగ్గించుకోలేకపోయిన చాలా వరకు తగ్గించుకోవచ్చు.
ప్రతి రోజు ఆహారంలో 20 నుంచి 30 గ్రాముల పైబర్ ఉండేలా చూసుకోవాలి. పైబర్ పెద్ద ప్రేగులను శుభ్రపరచి,మలినాలను తొలగించి చర్మం నిగనిగలాడేందుకు సహాయం చేస్తుంది.
కొవ్వు తక్కువ ఉండే ఆహారం తీసుకోవటం అనేది ఆరోగ్యానికే కాకుండా మచ్చలను తగ్గించటానికి కూడా సహాయపడుతుంది. హార్మోన్స్ అసమానతల వలన కూడా చర్మంపై మచ్చలు రావచ్చు. అందువలన కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం వలన హార్మోన్స్ అసమానతల సమస్య తగ్గుతుంది.
వేరుశనగపప్పులను తినటం పూర్తిగా మానివేయాలి. వీటిని తినటం వలన ముఖం మీద మచ్చలు వచ్చే ప్రమాదం ఉంది.
అదే విధంగా వేపుడు పదార్దాలు,చిప్స్ వంటి వాటికీ కూడా దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా ఉండే పాప్ కార్న్,చిప్స్ వంటి వాటిని పూర్తిగా మానివేయాలి.
పాలాధారిత పదార్దాలు,చీజ్,పాలకోవా,ఐస్ క్రీం వంటి వాటికీ దూరంగా ఉండాలి. కొవ్వు తీసిన పాలను ఉపయోగించాలి.
ఒమేగా 3 ప్యాటి ఆమ్లాలు ఎక్కువగా ఉన్న చేపలను తరచుగా ఆహారంలో తీసుకోవాలి. ఇవి ముఖం మీద మచ్చలను తగ్గించటంలో బాగా సహాయం చేస్తాయి.
నీరు,గ్రీన్ టీ వంటివి శరీరంలోని విష పదార్దాలను బయటకు పంపటానికి సహాయపడతాయి. దీని వలన చర్మం ఆరోగ్యంగా ఉండి మచ్చలు తగ్గటానికి సహాయం చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.