Hair Fall remedy:వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది



మారిన జీవనశైలి,వాతావరణంలో కాలుష్యం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనబడుతుంది. జుట్టు రాలే సమస్య కనబడగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. 

అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి నీరు  కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ అవిసె గింజలు, ఒక స్పూన్ బియ్యం, ఒక స్పూన్ మెంతులు వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం నుండి జెల్లీని సపరేట్ చేయాలి. ఈ జెల్లీలో ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయతో తల స్నానం చేయాలి.

 ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు బలోపేతం అయ్యి జుట్టు రాలదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top