కడాయి పన్నీర్ మసాలా ను ఈ విధంగా చేస్తే రెస్టారెంట్ స్టైల్ లో చాలా బాగుంటుంది. చాలా సులభంగా మన ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు :బటర్ - 20 గ్రా॥లు, క్రష్ చేసిన ఎండు మిర్చి - 2 గ్రా॥లు, క్రష్ చేసిన ధనియాలు - 2 గ్రా॥లు, చతురస్ర ముక్కలుగా తరిగిన సిమ్లా మిర్చి - 15 గ్రా॥లు, చతురస్ర ముక్కలుగా తరిగిన ఉల్లి - 15 గ్రా॥లు, చతురస్ర ముక్కలుగా తరిగిన టమాటా - 15 గ్రా॥లు, లబాబ్దార్ మసాలా -50 గ్రా॥లు, మఖానీ గ్రేవీ - 50 గ్రా॥లు, కాటేజ్ చీజ్ ముక్కలు - 180 గ్రా॥లు, కసూరీమేథీ పొడి - 3 గ్రా॥లు, ఎర్ర కారం - 5 గ్రా॥లు, గరం మసాలా - కొంచెం, తరిగిన కొత్తిమీర - కాస్త, ఉప్పు - తగినంత,
తయారుచేసే పద్ధతి :
ప్యాన్ లో బటర్ వేసి వేడి చేసి, అందులో క్రష్ చేసిన ఎండు మిర్చి , ధనియాలు వేసి కొంచెం చిటపట అన్నాక, ఉల్లి, టమాటా, సిమ్లా మిర్చి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత లబాబ్దార్ మసాలా, మఖానీ గ్రేవీ, మిగిలిన మసాలాలు వేసి ఉడికించండి. చివరగా కాటేజ్ చీజ్ తో పాటు పై నుంచి లెమన్ జ్యూస్, గరం మసాలా వేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టీమ్డ్ రైస్ లేదా నాన్ తో సర్వ్ చేయండి.