Chick Pea Dosa Recipe:ప్రోటీన్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్ చేస్తే అలసట,నీరసం అసలు ఉండవు



ఉదయం సమయంలో ప్రోటీన్ తో కూడిన బ్రేక్ఫాస్ట్ చేస్తే అలసట, నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. ప్రోటీన్ సమృద్దిగా ఉండే శనగలతో దోశ తయారు చేసుకొని తింటే బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.

కావలసినవి 
ఒక కప్పు శనగలు, 2 కప్పుల బియ్యం, అరస్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఉప్పు,నూనె వేగించటానికి, నానబెట్టటానికి నీరు. 

తయారి విధానం 
ముందుగా, ఒక పెద్ద గిన్నెలో 2 కప్పు బియ్యం, 1 కప్పు శనగలు,  ½ స్పూన్ మెంతులు  తీసుకోండి. బాగా కడిగి కనీసం 6 గంటలు నీటిలో నానబెట్టాలి.  నానబెట్టిన బియ్యం మరియు శనగలను మిక్సర్ గ్రైండర్‌లో వేసి సరిపడా నీటిని పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. 

ఈ పిండిని 8 గంటల పాటు అలా వదిలేస్తే పులుస్తుంది. ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి.  దోస పాన్ వేడి చేసి పిండిని dosa మాదిరిగా వేయాలి. Dosa చుట్టూ అరస్పూన్ నూనె వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top