బ్రెడ్ ని చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒక్కోసారి బ్రెడ్ ఎక్కువగా మిగిలిపోతుంది. అలా మిగిలినప్పుడు ఇప్పుడు చెప్పే విధంగా మంచురియా చేసుకుంటే చాలా బాగుంటుంది.
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసెస్ - 7
ఉల్లిపాయ - 1
క్యారెట్ - 1
వెల్లుల్లి రెబ్బలు - 12
అల్లం - చిన్న ముక్క
పన్నీర్ తురుము - అర కప్పు
కొత్తిమీర తరుగు -కొద్దిగా
మైదా - కప్పు
బియ్యప్పిండి - అరకప్పు
సోయాసాస్ - 1 స్పూన్
వెనిగర్ - 2 స్పూన్స్
మిరియాల పొడి - అర స్పూన్
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 2
నూనె - వేయించడానికి సరిపడా
టొమాటో సాస్ - 4 స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర స్పూన్
తయారుచేసే పద్ధతి :
బ్రెడ్ స్లైసుల అంచుల్ని కట్ చేసి ఒక బౌల్ లో వేసి కొంచెం నీళ్ళు చల్లి ముద్దగా కలపాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,అల్లం, వెల్లుల్లి తరుగు,పన్నీర్ తరుగు, క్యారెట్ ముక్కలు,కొత్తిమీర తరుగు, బియ్యప్పిండి,మైదా, సరిపడా ఉప్పు వేసి అవసరమైతే కొంచెం నీరు పోసి గట్టి పిండిలా కలపాలి.
ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక పైన తయారుచేసుకున్న ఉండలను వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.
మరల ఇంకో బాణలి పెట్టి రెండు స్పూన్ ల నూనె వేసి,దానిలో ముందుగా వేగించి పెట్టుకున్న మంచురియా ఉండలు, వెనిగర్, టొమాటో సాస్,సోయాసాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్,కొంచెం ఉప్పు,మిరియాల పొడి వేసి బాగా కలపాలి. రెండు నిముషాలు అయిన తర్వాత పళ్ళెంలో సర్వ్ చేయాలి. దీనికి టొమాటో సాస్ మంచి కాంబినేషన్.