Weight Loss Tips:ఎక్కువ ఆహారం తీసుకుంటేనే కదా పొట్ట వచ్చేది? మరి పొట్టను తగ్గించే ఆహారం ఏమిటన్న సందేహం మీకు రావచ్చు. కొన్ని రకాల ఆహార పదార్దాలను తీసుకోవటం ద్వారా పొట్టలో పేరుకున్న కొవ్వును తగ్గించుకోవచ్చు.
ఆటామిల్
తక్కువ క్యాలరీలు,అదిక మొత్తంలో పైబర్ ఉండే ఆటామిల్ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉదయాన్నే దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఇది కేవలం కొవ్వును తగ్గించటమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఊబకాయాన్ని తగ్గించటం ద్వారా కోలన్ క్యాన్సర్,గుండె జబ్బుల వంటి వ్యాదులను దూరంగా ఉంచుతుంది.
విటమిన్ సి
అదిక బరువును,ఊబకాయాన్ని తగ్గించటంలో విటమిన్ సి కూడా తోడ్పడుతుంది. విటమిన్ సి ని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని పొందటమే కాకుండా బరువును కూడా క్రమబద్దం చేయవచ్చు. విటమిన్ సి అదికంగా లభించే జామ,పుచ్చకాయ,ద్రాక్ష,నిమ్మకాయ అప్రికాట్ పండ్లను ప్రతి రోజు తీసుకోవాలి.
కాల్షియం
కాల్షియం అధికంగా లభించే పాల ఉత్పత్తులలో శరీర ప్రక్రియను మరింతగా పెంచుతాయి.
తక్కువ కొవ్వు కలిగిన పెరుగు,వెన్న తీసిన పాలు,పలుచని మజ్జిక సాధ్యమైనంతవరకు ఎక్కువగా తీసుకోవాలి.
విటమిన్ బి 12
ఇది బరువు తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. గుడ్డులో విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. అయితే గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తీసుకోవాలి. తెల్లసోనలోనే ఎక్కువగా ప్రోటిన్స్ ఉంటాయి.
చెర్రి పండ్లు
చెర్రి పండ్లు అధికంగా తీసుకోవటం ద్వారా ఆరోగ్య లాభాలతో పాటు అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయి. వీటిని నేరుగా లేదా జెల్లీ,జ్యూస్,జామ్ రూపంలో తీసుకోవచ్చు. అధిక బరువును తగ్గించే శక్తి చెర్రి పండ్లకు ఉంది.