రసగుల్లా అంటే మనలో చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే వెరైటిగా బ్రెడ్ తో రసగుల్లా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. బ్రెడ్ తో రసగుల్లా ఎలా తయారుచేస్తారో చూద్దాం.
కావలసిన పదార్దాలు
బ్రెడ్ ప్యాకెట్ - 1
పంచదార - 2 కప్పులు
నెయ్యి - పావు కప్పు
యాలకుల పొడి - 1 స్పూన్
తయారుచేసే విధానం
ముందుగా బ్రెడ్ ముక్కల అంచులను తీసివేయాలి. వాటిపై కొంచెం నీరు చల్లి మెత్తగా చేయాలి. ఒక అరగంట అలా ఉంచాలి. ఆ తర్వాత యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి. పెనంపై నెయ్యి వేసి ఈ ఉండలను దోరగా కాల్చాలి.
ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి పంచదార,నీరు పోసి లేత పాకం తయారుచేసుకోవాలి. దీనిలో పైన తయారుచేసుకున్న ఉండలను వేయాలి. అంతే పిల్లలు ఎంతో ఇష్టపడే బ్రెడ్ రసగుల్లా రెడీ.