
కావలసిన పదార్ధాలు
1 cup బొంబాయి రవ్వ (250 gms)
1/2 cup పచ్చి కొబ్బరి తురుము
3 tbsps నెయ్యి (50 gms)
10 - 15 జీడి పప్పు
10 - 15 ఎండు ద్రాక్ష
1 cup పంచదార (175 gms)
100 ml నీళ్ళు
3 - 4 యాలకల పొడి
తయారి విధానం
ఒక కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు పచ్చి కొబ్బరి తురుము కలిపి రెండు గంటలు పక్కన పెట్టాలి. మూకుడులో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే మూకుడు లో రెండు గంటలు నానబెట్టుకున్న రవ్వ, కొబ్బరి మిశ్రమం వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించి పక్కన పెట్టాలి.
ఆ తర్వాత పంచదార, నీళ్లు పోసి తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి, తీగపాకం రాగానే పొయ్యి ఆఫ్ చేసి వేగించుకున్న రవ్వ, కొబ్బరి మిశ్రమం, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలిపి గోరువెచ్చగా అయ్యేవరకు అలా వదిలేయాలి.
గోరువెచ్చగా అయిన తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలిపి నెయ్యి రాసుకుని లడ్డూలు తయారు చేయాలి. ఈ లడ్డులు కనీసం వారం రోజులు పాటు తాజాగా ఉంటాయి.