Instant Semiya Uthappam: ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో రోజు తయారుచేసే టిఫిన్స్ బోర్ కొడితే ఇప్పుడు చెప్పే ఉతప్పం చాలా బాగుంటుంది. సేమ్యాతో ఉతప్పం చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సేమియా ఉతప్పం చల్లారిన తర్వాత కూడా మెత్తగా మరియు రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు
1 కప్పు పెరుగు
1 కప్పు బొంబాయి రవ్వ
1 కప్పు సేమియా - వెర్మిసెల్లి
1/2 స్పూన్ వంట సోడా
1/2 ముక్క అల్లం
3 పచ్చి మిరపకాయలు
నూనె - ఉతప్పం కాల్చడానికి సరిపోతుంది
ఉప్పు - రుచికి
1 ¼ కప్పుల నీరు
మసాలా కోసం:
1/2 టేబుల్ స్పూన్ నూనె
1/3 కప్పు ఉల్లిపాయ (తరిగిన)
1/2 స్పూన్ జీరా (జీలకర్ర)
కరివేపాకు - 2 రెమ్మలు (సన్నగా తరిగినవి)
తయారి విధానం
పెరుగులో సోడా వేసి పెరుగు నురుగు వచ్చే వరకు బాగా కలపాలి. అల్లం,పచ్చిమిర్చిలను మెత్తని పేస్ట్ గా చేసి వేయాలి. ఆ తర్వాత సేమ్యా,బొంబాయి రవ్వ,ఉప్పు వేసి...ఆ తర్వాత ఒక కప్పు నీటిని పోసి బాగా కలిపి అరగంట అలా వదిలేస్తే సేమ్యా మెత్తగా అవుతుంది.
ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకులను ఒక నిమిషం పాటు నూనెలో వేగించి పిండిలో కలపాలి. పాన్ వేడి చేయండి. గరిటెతో పిండిని పాన్‌పై ఉంచి కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఉతప్పం అంచుల వెంట కొద్దిగా నూనె పోసి మీడియం మంట మీద కాల్చండి.
రెండు వైపులా వేగించాలి. మీకు నచ్చిన ఏదైనా చట్నీతో లేదా సాంబార్‌తో వేడిగా తింటే రుచి చాలా బాగుంటుంది.