How to Make Gobi 65 With Tips: గోబీ 65 అనేది దక్షిణ భారత రెస్టారెంట్‌లలో సర్వసాధారణమైన వంటకం. వివాహాల్లో లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాలలో స్టార్టర్‌గా తప్పకుండా వడ్డిస్తారు. ఈ రోజు చాలా సులభంగా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
3 టేబుల్ స్పూన్లు నూనె
2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి (తరిగిన)
3 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ (తరిగిన)
2 పచ్చి మిరపకాయలు (పొడవుగా కోయాలి)
2 రెమ్మలు కరివేపాకు
3 ఎండు ఎర్ర మిరపకాయలు
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
కొత్తిమీర
తయారి విధానం
కాలీఫ్లవర్ ను ముక్కలుగా కట్ చేసి వేడి నీటిలో వేసి 70% ఉడికిన తర్వాత నీటిని తీసివేసి చల్లారబెట్టాలి. ఒక కప్పు పెరుగులో పావు స్పూన్ పసుపు,ఒక స్పూన్ గరం మసాలా,ఒక స్పూన్ ధనియాల పొడి,అరస్పూన్ కారం,సాల్ట్ వేసి బాగా కలపాలి.
ఒక బౌల్ లో కాలీఫ్లవర్ ముక్కలు వేసి దానిలో 3 స్పూన్ల మైదా, 3 స్పూన్ల మొక్కజొన్న పిండి మరియు పావు కప్పు నీరు వేసి బాగా కలిపి...ఆ తర్వాత ముక్కలను వేసి బాగా కోట్ చేయండి. ఆ ముక్కలను వేడి నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.
పాన్ లో 3 స్పూన్ల oil వేసి వేడి అయ్యాక ఎండు మిరపకాయలు, తరిగిన వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి.
ఆ తర్వాత పెరుగు మిశ్రమాన్ని వేసి, మీడియం మంట మీద గ్రేవీ చిక్కగా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి. వేయించిన కాలీఫ్లవర్ ముక్కలను చిక్కగా అయినా గ్రేవీలో వేసి బాగా టాసు చేయాలి.
కాలీఫ్లవర్ ద్రవాన్ని పీల్చుకునే వరకు అధిక మంట మీద ఉడికించాలి. మంట నుండి కిందకు దించి కొద్దిగా కొత్తిమీర చల్లాలి. అంతే ఎంతో రుచికరమైన Cauliflower 65 రెడి.