Tomato rasam:టమోటా రసం చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. రసం పొడి,రసం ఎలా తయారుచేయాలో చూద్దాం.
రసం పొడి కోసం
1 స్పూన్ నూనె
1 tsp ధనియాలు
½ టీస్పూన్ జీలకర్ర
10 మెంతి గింజలు
3 ఎండిన ఎర్ర మిరప
కొన్ని కరివేపాకు
¼ స్పూన్ నల్ల మిరియాలు
రసం కోసం పదార్థాలు:
1 టమోటా (సన్నగా తరిగిన)
2 పచ్చిమిర్చి (పొడవుగా కోయాలి)
కొన్ని కరివేపాకు
1 కప్పు చింతపండు రసం
½ టీస్పూన్ పసుపు పొడి
½ స్పూన్ బెల్లం
రుచికి ఉప్పు
2 కప్పుల నీరు
1 కప్పు పప్పు (వండినది)
2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు (సన్నగా తరిగినవి)
తాలింపు కోసం:
1 స్పూన్ నూనె
1 tsp ఆవాలు
½ స్పూన్ మినపప్పు
2 ఎండిన ఎర్ర మిరపకాయ (ముక్కలు)
కొన్ని కరివేపాకు
చిటికెడు ఇంగువ
తయారి విధానం
పొయ్యి మీద మూకుడు పెట్టి ఒక స్పూన్ నూనె వేసి ధనియాలు,జీలకర్ర,మెంతి గింజలు, ఎర్ర మిరపకాయ, కరివేపాకు మరియు మిరియాలు వేసి వేయించాలి. వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
మూకుడులో టమోటాలు, పచ్చిమిర్చి మరియు కరివేపాకు, చింతపండు రసం , పసుపు, బెల్లం మరియు ఉప్పు వేసి 15 నిమిషాలు మూతపెట్టి మరిగించండి. 2 కప్పుల నీరు వేసి మరిగించండి.
ఇప్పుడు ఉడికించిన పప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రసం పొడి వేసి కలపాలి.
మూకుడులో ఒక స్పూన్ నూనె వేసి ఆవాలు, మినపప్పు , ఎండు మిరపకాయ, కరివేపాకు మరియు ఇంగువ వేసి వేగించి రసంలో తాలింపు వేయాలి. చివరగా కొత్తిమీరను కలిపి ఒక నిమిషం అయ్యాక సర్వ్ చేయటమే.