Challa Punugulu:ప్లపీ ప్లఫీ చిన్న చిన్న చల్ల పునుగులు ఏంటో వినగానే తినాలనిపిస్తుంది కదా.. మీరు కూడా ఈ ఇంగ్రిడియంట్స్ తో ఇలాగే కొలతలతో చేసుకొని ఎంజాయ్ చేయండి.
కావలసినవి:
ఒక కప్పు మైదా ,ఒక కప్పు పెరుగు, చిటికెడు ఉప్పు ,వంట సోడా, జీల కర్ర ,పచ్చిమిర్చి ,అల్లం ముక్క.
చేసే విధానం:
ఒక కప్పు మైదా ,అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ ఇంచ్ అల్లం తరుగు, ఒక పచ్చిమిర్చి తరుగు, పావు స్పూను వంటసోడా, ఉప్పు, ఒక కప్పు పుల్లని పెరుగు కొంచెం, వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. బాగా గట్టిగా ఉండకూడదు .బాగా జారుగాను ఉండకూడదు.
గట్టిగా ఉంటే లోపల బాయిల్ అవ్వదు. జారుగా ఉంటే అవి పునుగులాగా రాదు ఆయిలీగా ఉంటాయి. కాబట్టి మధ్యస్థంగా కలుపుకొని ఒక గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు నూనెను హీట్ చేసి ,చిన్న చిన్న పునుగులు లాగా వేసుకుంటే ప్లఫీగా వేగుతాయి.
ముందు మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. ఆ తర్వాత కలర్ రావాలి కాబట్టి అప్పుడు high flame పెట్టుకొని వాటిని తీసి ఒక టిష్యూ పేపర్లో పెట్టుకోండి. వేడివేడిగా ఆఫర్ చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి.


