Benefits of Clove: మనం ప్రతిరోజు వంటింట్లో లవంగాలను వాడుతూ ఉంటాం. లవంగాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. లవంగాలను ఈ విధంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. లవంగాలు డయాబెటిస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడతాయి.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక ఎనిమిది లవంగాలను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
డయాబెటిస్ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. లవంగాలను మితంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
లవంగాల్లో ఉన్న గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. లవంగాలను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి కూడా తాగవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


