Iron Deficiency: ఐరన్‌ లోపం చాలా డేంజర్‌.. ఈ లక్షణాలని విస్మరించవద్దు..!

Iron Deficiency: ఐరన్ లోపం అనే మాటని చాలా మంది వినే ఉంటారు. దాన్ని అదికమించటానికి పాటించవలసిన పద్దతుల గురించి కూడా తెలిసే ఉంటుంది. అసలు ఐరన్ లోపాన్ని గుర్తించటం ఎలా అనేది చాలా మందికి తెలియదు. అందువల్ల దాని గురించి తెలుసుకుందాము.

అలసట
ఐరన్ లోపాన్ని ముందుగా బయట పెట్టేది అలసటే ! చిన్న పని చేసినా త్వరగా అలసిపోవటం, ఆయాసం రావటం వంటివి ఐరన్ లోపాన్ని బహిర్గతం చేస్తాయి. మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు ఊపిరి అందకుండా ఉండటం,ఆయాసం రావటం ఇవన్నీ గుండెకు సంబందించిన సమస్యలుగా పొరబడతారు. కానీ,ఇవి ఐరన్ లోపానికి చిహ్నాలని తెలుసుకోవాలి.

గుండె
ఐరన్ లోపం గుండె పని తీరు మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గుండె అదరటం,వేగంగా కొట్టుకోవటం అనేవి గుండె జబ్బు లక్షణాలని బయపడవలసిన అవసరం లేదు. ఇరాన్ లోపం కారణంగా పై రెండు సమస్యలు తలెత్తవచ్చు.

చర్మం
చర్మం మీద నల్ల మచ్చలు ఏర్పడటం లేదా పాలిపోయినట్లు ఉండటం వంటివి ఐరన్ లోపంగా చెప్పవచ్చు. దీనికి తోడు జుట్టు కూడా బాగా ఎక్కువగా ఊడిపోతుంది. ఇది కూడా ఐరన్ లోపం అని చెప్పవచ్చు.

చెవులు
ఐరన్ కారణంగా ఒక చెవి లేదా రెండు చెవులలో శబ్దాలు వినపడవచ్చు. ఈ శబ్దాలు బయట నుంచి కాకుండా లోపలి నుంచి పుడతాయి. ఏదో ఒకసారి శబ్దాలు వినబడితే భయపడవలసిన అవసరం లేదు. కానీ ఇవి తరచుగా ఉంటే మాత్రం డాక్టర్ ని తప్పనిసరిగా సంప్రదించాలి.

తలనొప్పి
తరచూ తలనొప్పి కూడా ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. రోజులో కొద్దిసేపు ఉంటే పర్వాలేదు. కానీ ఎక్కువ సేపు ఉంటే మాత్రం ఐరన్ లోపంగా గుర్తించాలి.

నాలుక
ఐరన్ లోప ప్రభావం గొంతు,నాలుక మీద కూడా పడుతుంది. పదార్దాల రుచి తెలియకపోవటం, నాలుక మీద పుండ్లు పడటం,పదార్దాలు మింగుడు పడకపోవటం వంటివి ఐరన్ లోపాన్ని సూచిస్తాయి. 

పై రెండు కారణాల వల్ల చాలా మంది ఐస్ క్రీం అంటే ఎక్కువ ఇష్టపడతారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఐరన్ లోపాన్ని అధికమించటమే దీనికి మంచి పరిష్కారం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top