Sleeping Time:పుట్టినప్పటి నుండి నిద్రపోయే సమయాలు మారుతూ ఉంటాయి. ఏ స్టేజ్ లో ఎంత నిద్ర అవసరమో అన్న వివరాలు తెలుసుకుందాము. మనం పెరుగుతున్నప్పుడు మన నిద్ర సమయాలు కూడా మారతాయి.
ఆరు నెలల లోపు పిల్లలు
అందరి కన్నా వీరు ఎక్కువ నిద్ర పోతారు. రోజుకి 16 నుంచి 20 గంటలు నిద్ర పోతారు. అంటే వీరు పాలు త్రాగటానికి,కొంతసేపు ఆడుకోవటానికి మాత్రమే మేల్కొని ఉంటారు.
ఆరు నుంచి ఏడాది వరకు
ఈ వయస్సు పిల్లలు రోజు మొత్తంలో నిద్రపోయే సమయం కొద్దిగా తగ్గుతుంది. మనుషుల్ని కొద్దిగా గుర్తుపట్టటం,వారితో వారు ఆడుకొనే స్టేజ్ కాబట్టి 14 నుంచి 15 గంటలు నిద్రపోతారు.
ఏడాది నుంచి మూడు సంవత్సరాల వరకు
ఆటలు ఎక్కువై నిద్ర మీద ధ్యాస తగ్గుతుంది. వీరికి 10 నుంచి 13 గంటల నిద్ర సరిపోతుంది.
మూడు నుంచి పది సంవత్సరాల వరకు
స్కూల్ కి వెళ్ళటం మొదలు పెట్టి స్నేహితులతో ఆటలలో పడే వయస్సు. వీరికి 10 నుంచి 12 గంటల నిద్ర సరిపోతుంది.
పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు
ఆటలు,చదువు తప్ప మరే లోకం తెలియని వయస్సు. ఆటలతో అలసిపోయిన శరీరానికి 10 గంటల నిద్ర సరిపోతుంది.
టినేజర్స్ మరియు ఆపై వయస్సు కల వారికీ
వీరికి తప్పనిసరిగా 6 నుంచి 9 గంటల నిద్ర అవసరం అని చెప్పవచ్చు.


