Mirchi Bajji : మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. బయట దొరికే బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. అలాంటి రుచితో మన ఇంటిలోనే సులభంగా మిరపకాయ బజ్జీని తయారుచేసుకోవచ్చు.
కావలసిన పదార్దాలు
లావు మిరపకాయలు 250 గ్రామ్స్
శనగపిండి 250 గ్రామ్స్
ఉప్పు తగినంత
కారం 1 స్పూన్
గరం మసాలా 1 స్పూన్
ధనియాల పొడి 2 స్పూన్స్
వంట సోడా చిటికెడు
నూనె వేయించడానికి
పుదీనా 1/2 కప్పు
నువ్వులు 1/4 కప్పు
పచ్చిమిర్చి ౩
చింతపండు పులుసు 2 స్పూన్స్
తయారి విధానం
ముందుగా మిరపకాయలను నిలువుగా చీల్చి గింజలు తీయాలి. వీటిని మరిగే నీటిలో ఐదు నిముషాలు ఉంచితే కొంచెం కారం తగ్గుతుంది. నువ్వులను దోరగా వేగించాలి. చింతపండు పులుసు,పచ్చిమిర్చి,పుదినా, వేగించిన నువ్వులు అన్నింటిని కలిపి పేస్ట్ చేసి మిరపకాయలలో కూరి పక్కన పెట్టాలి.
శనగపిండిలో గరమ్ మసాలా,ధనియాలపొడి, వంట సోడా, ఉప్పు,కారం వేసి నీటితో గరిట జారుగా కలిపి ఒక అరగంట ఉంచాలి. పైన కూరి పెట్టుకున్న మిరపకాయలను కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో ముంచి ఒక్కొక్కటిగా నూనెలో వేగించాలి. అలాగే కొంచెం కారం తినలేని వారు ఈ బజ్జిని ఇంకోసారి శనగపిండిలో ముంచి నూనెలో వేగిస్తే కారం తగ్గుతుంది.