Meal maker Kurma: నాన్ వెజ్ తినని వారు ఇప్పుడు చెప్పే కర్రీ చాలా పోషకాలను అందిస్తుంది. సోయా కుర్మా తయారు చేయడం చాలా సులభం. ఇది స్పైసీ మరియు టేస్టీగా ఉంటుంది. సోయాను మీల్ మేకర్ అని పిలుస్తారు. ఇది నాన్-వెజిటేరియన్ డిష్‌కి గట్టి పోటీని ఇస్తుందని చెప్పవచ్చు.
కావలసిన పదార్ధాలు
1 కప్పు మీల్ మేకర్
3 కప్పుల వేడి నీరు
ఉప్పు (కొద్దిగా)
మసాలా పేస్ట్ కోసం:
4 ఏలకులు
4 లవంగాలు
1/4 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు
1 అంగుళం దాల్చిన చెక్క
అల్లం (చిన్న ముక్క)
5 వెల్లుల్లి
2 ఉల్లిపాయలు
2 పచ్చిమిర్చి
కూర్మ కోసం:
5 టేబుల్ స్పూన్లు నూనె
1/2 టేబుల్ స్పూన్ పసుపు
1 బే ఆకు (బిరియాని ఆకు)
2 ఏలకులు
2 లవంగాలు
1 అంగుళం దాల్చినచెక్క
2 పచ్చి మిరపకాయలు (పొడవుగా కోయాలి)
2 రెమ్మలు కరివేపాకు
1 కప్పు టొమాటో పేస్ట్
ఉ ప్పు
1 టేబుల్ స్పూన్ కారం
1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి
1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా
1 1/4 కప్పు నీరు
1/2 కప్పు పెరుగు
కొత్తిమీర
1 టేబుల్ స్పూన్ కసూరి మేతి
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
తయారి విధానం
ఒక గిన్నెలో నీటిని పోసి మీల్ మేకర్, కొంచెం ఉప్పు వేసి 15 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని పిండి మీల్ మేకర్‌ను పక్కన పెట్టాలి. మిక్సీ జార్ లో 4 ఏలకులు 4 లవంగాలు,1/4 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు,1 అంగుళం దాల్చిన చెక్క, అల్లం (చిన్న ముక్క),5 వెల్లుల్లి,2 ఉల్లిపాయలు,2 పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.
పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి, మీల్ మేకర్‌ను కొద్దిగా పసుపు వేసి ఒక నిమిషం పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేగించాలి. టొమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఉప్పు,పసుపు,కారం,ధనియాల పొడి,జీలకర్ర పొడి,గరం మసాలా వేసి బాగా వేయించాలి. మసాలాలు మాడకుండా ఉండటానికి కొంచెం నీటిని పోయాలి.
వేయించిన మీల్ మేకర్‌ను వేయించిన మసాలాలో కలపండి. నీరు వేసి 7-8 నిమిషాలు ఉడికించాలి. గిలకొట్టిన పెరుగు కలిపి...మూత మూసివేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర, కసూరి మేతి, కొద్దిగా నిమ్మరసం కలిపితే ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ లేదా సోయా కుర్మా సిద్ధం.