Dondakaya karam:ఆంధ్రా దొండకాయ కారాన్ని ఇలా చేసిపెడితే ప్లేట్ మొత్తం ఖాళీచేస్తారు

Dondakaya karam: దొండకాయతో ఎన్నో రకాల కూరలు చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఒకేలా చేసుకుంటే తప్పకుండా బోర్ కొడుతుంది. అలా కాకుండా ఇపుడు చెప్పే  విధంగా చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. దొండకాయ కారం అన్నం లేదా రోటీతో చాలా బాగుంటుంది.

కావలసిన పదార్ధాలు
1/4 కిలో దొండకాయ
1 ఉల్లిపాయ
1/2 కప్పు కరివేపాకు
1 స్పూన్ ఎర్ర కారం
1/2 స్పూన్ ధనియాల పొడి
1/4 టీస్పూన్ జీలకర్ర పొడి
1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1/2 స్పూన్ ఉప్పు
నూనె

తయారి విధానం
దొండకాయలను సన్నగా,పొడవుగా కట్ చేసి ఒక బౌల్ లో వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కారం,1/2 టీ స్పూన్ ఉప్పు,1/2 టీస్పూన్ ధనియాల పొడి, 1/4 టీస్పూన్ జీలకర్ర పొడి, మరియు 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక స్పూన్ నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.

పొయ్యి మీద మూకుడు పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగించాలి. ఆ తర్వాత దొండకాయ ముక్కలను వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి. ఈ కూరను అన్నం, పప్పు లేదా సాంబార్‌తో తింటే చాలా బాగుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top