Crispy Potato Fry:బంగాళాదుంప వేపుడు కర కరలాడుతూ రుచిగా ఉండాలంటే ఇలా చేసి చూడండి

Crispy Potato Fry: బంగాళదుంప అంటే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడు ఒకేలా కూర,వేపుడు కాకుండా ఇప్పుడు చెప్పే Crispy Potato Fry చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

కావలసిన పదార్ధాలు 
3-4 బంగాళదుంపలు 
2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి 
1/2 టీస్పూన్ కారం 
1/2 టీస్పూన్ పసుపు 
రుచికి ఉప్పు 
నూనె

తయారి విధానం
బంగాళదుంపలను శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి 10 నిమిషాలు అలా ఉంచాలి. ఆ తర్వాత నీటిని తీసివేసి ముక్కలను కిచెన్ టవల్ లేదా పేపర్ టవల్ సాయంతో తడి లేకుండా పొడిగా చేసి పక్కన పెట్టాలి. 

ఒక బౌల్ లో బియ్యం పిండి, కారం, పసుపు మరియు ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో బంగాళదుంప ముక్కలను వేసి బాగా కలిపి నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. అంతే ఎంతో రుచికరమైన Crispy Potato Fry రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top