Majjiga Garelu:గారెలు తయారు చేసుకోవాలంటే పప్పు పోసి నానబెట్టి రుబ్బి వేసుకోవాలి. దానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా ఇన్స్టెంట్ గారెలు తినాలంటే పుల్లగా కరకరలాడే మజ్జిగ గారెలను ట్రై చేయవచ్చు. చాలా సింపుల్ గా తయారు చేసుకునే మజ్జిగ గారెలు చాలా రుచిగా ఉంటాయి.
కావలసిన పదార్ధాలు
2 కప్పుల అటుకులు
1 కప్పు పుల్లని పెరుగు
2 స్పూన్ల పచ్చిమిర్చి తరుగు
1 స్పూన్ అల్లం తరుగు
1/4 tsp ఇంగువ
1 tsp జీలకర్ర
ఉప్పు
2 tsp కొత్తిమీర తరుగు
నూనె వేపుకోడానికి సరిపడా
తయారి విధానం
ఒక బౌల్లో అటుకులు పోసి అటుకులు మునిగే వరకు నీటిని పోసి ఐదు నిమిషాలు నాననివ్వాలి. ఆ తర్వాత అటుకులు లోంచి నీటిని గట్టిగా పిండి ఒక బౌల్లో వేసుకోవాలి. నానిన అటుకులలో జీలకర్ర, ఇంగువ, ఉప్పు, కొత్తిమీర తరుగు, పుల్లటి పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఇంగువ, మూడు స్పూన్ల బియ్యప్పిండి వేసి గట్టిగా అటుకులను పిండితో మెత్తగా అయ్యేవరకు కలుపుకోవాలి.
పిండి ముద్దను కొంచెం తీసుకొని అరచేతిలో వేసి గారెల మాదిరిగా తట్టుకొని నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా క్రిస్పీగా వేగించాలి. ఈ గారెలు వేగటానికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది.