
Moong Dal Sambar : ఎప్పుడు చేసుకొనే సాంబార్ వలె కాకుండా పెసరపప్పుతో sambar చేసుకుంటే చాలా బాగుంటుంది. సాంబార్ అంటే మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ sambar కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు.
కావలసిన పదార్ధాలు
1 కప్పు పెసరపప్పు
2 కప్పుల కూరగాయ ముక్కలు (మునగకాయలు, క్యారెట్లు, బీన్స్, వంకాయ మొదలైనవి)
1 చిన్న ఉల్లిపాయ (చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
2 టమోటాలు (చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
2 నుండి 3 పచ్చి మిరపకాయలు (పొడవుగా కోయాలి)
1 టీస్పూన్ ఆవాలు
1 టీస్పూన్ జీలకర్ర
ఒక చిటికెడు ఇంగువ
1/2 టీస్పూన్ పసుపు పొడి
1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి
1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు
కరివేపాకు
2 టేబుల్ స్పూన్లు నూనె లేదా నెయ్యి
రుచికి ఉప్పు
కొత్తిమీర
తయారి విధానం
పెసరపప్పును శుభ్రంగా కడిగి నీటిని పోసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె లేదా నెయ్యి వేసి వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర,ఇంగువ,కరివేపాకు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి.
ఆ తర్వాత ఉల్లిపప్య ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ మెత్తపడే వరకు వేగించాలి. ఆ తర్వాత కూరగాయల ముక్కలు,పసుపు,ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి.
ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత sambar పొడి ఎవేసి బాగా కలిపి...ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, చింతపండు రసం వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేయటమే.