Honey:పరగడుపున ఒక స్పూన్ తేనే తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా...?

Honey health benefits in telugu:మనలో చాలా మంది తేనేను ఎదో రకంగా వాడుతూనే ఉంటారు.  మార్కెట్ లో దొరికే తేనేను వాడటం కన్నా ఆర్గానిక్ తేనే వాడితే చాలా మంచిది. తేనెలో ఎన్నో బ్యూటీ,ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. 

సాదారణంగా తేనెను తీపినిచ్చే పదార్ధంగా ఉపయోగిస్తారు. తేనెలో 70-80 శాతం చక్కెర మరియు నీరు, ఖనిజాలు మరియు ప్రోటీన్ ఉంటుంది. తేనే అలెర్జీలు తొలగించడానికి సహాయపడటమే కాక అనేక అదనపు ఉపయోగాలను కలిగి వుంటుంది.

1. కాలిన గాయాలు
కొన్ని అధ్యయనాలలో, కాలిన గాయాలకు తేనెను ఉపయోగిస్తే చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది. ఒక క్లినికల్ ట్రయల్ లో కాలిన గాయాలకు తేనెను రాస్తే వాపు నయం అవటం, ఇన్ ఫెక్షన్ నియంత్రణ, వేగంగా నయం అవటం వంటి విషయాలు తెలిసాయి.

2. జ్ఞాపకశక్తి
మొనోఫాజ్ మరియు ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో తక్కువ మరియు దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి మెరుగుదలకు తేనే సహాయపడుతుంది. ఒక అధ్యయనంలో, ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలకు కొన్ని వారాల పాటు తేనె చికిత్సలు చేస్తే, హార్మోన్ చికిత్సలు పొందిన స్త్రీల కంటే తేనే చికిత్సలు తీసుకున్న వారిలోజ్ఞాపకశక్తి మెరుగుదల కనిపించింది.

3. డయాబెటిస్
తేనే చక్కర కంటే తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తేనే చక్కెర కంటే తియ్యగా ఉంటుంది. అలాగే ఆహారాల్లో తక్కువ స్వీటెనర్ గా ఉపయోగించడానికి సహాయపడుతుంది. తేనె చక్కెర కంటే మెరుగైన ఎంపిక అని చెప్పవచ్చు. ఒక ప్రయోగంలో, పరిశోధకులు తేనే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి ఒక సమర్థవంతమైన మార్గం అని కనుగొన్నారు.

4. క్యాన్సర్
తేనెలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన క్యాన్సర్ చికిత్స లో సహాయపడుతుంది. ఇరాన్ లో 2011 అధ్యయనంలో తేనె మూత్రపిండాల క్యాన్సర్, ఒక రకమైన మూత్రపిండ కణ క్యాన్సర్ ల మీద ప్రభావం ఎలా చూపుతుందో చూసారు. తేనే క్యాన్సర్ కణాల పెరుగుదలను చాలా ప్రభావవంతంగా అపిందని పరిశోధకులు కనుగొన్నారు. అలాగే కేన్సర్ చికిత్సలో తేనే ఎలా సహాయపడుతుందో మరింత అధ్యయనం చేయాలని పరిశోదకులు అంటున్నారు.

6. మొలలు
మొలలు కారణంగా మలద్వారం వద్ద దురద మరియు నొప్పి,రక్తం పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ఒక ఇంటి పరిష్కారం గురించి చూస్తూ ఉంటే కనుక తేనెను ఉపయోగించవచ్చు. తేనె, ఆలివ్ నూనె మరియు మైనం మిశ్రమాన్ని మొలల నివారణకు ఒక సమయోచిత చికిత్సగా ఉపయోగిస్తారు. ఈ ప్రయోగం పలితంగా రక్తస్రావం గణనీయంగా తగ్గటం, అలాగే నొప్పి మరియు దురద తగ్గటం కనుగొన్నారు.

7. గాయాలు మరియు పుళ్ళు
తేనెను కొన్ని శతాబ్దాలుగా గాయాలు మానటానికి వాడుతున్నారు. జెల్ మరియు క్రీమ్స్ కన్నా తేనే బాగా పనిచేస్తుంది. ఒక అధ్యయనం లో తేనే గాయాల నిర్మూలన మరియు చనిపోయిన కణజాలం తొలగించటానికి చాలా వేగంగా మరియు ప్రభావవంతముగా పనిచేస్తుందని తెలిసింది. 

ఇతర పరిశోధకులు కూడా గాయాల డ్రెస్సింగ్ కు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుందని అంగీకరించారు. అయితే అది మొత్తం గాయం మీద ఆధారపడి ఉంటుంది. లోతైన కోతలు మరియు గాయాలకు తేనెను ఉపయోగించటానికి ముందు డాక్టర్ ని సంప్రదించాలి. లేకపోతే అది ఇన్ ఫెక్షన్ కి కారణం అవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top