Tiffin Chutney:ఇడ్లి,దోశ ఇలాంటి టిఫిన్లలోకి ఎప్పుడూతినే చట్నీలు బోరుకొడితే ఈ చట్నీ ట్రై చెయ్యండి

Tiffin Chutney
Tiffin Chutney:టిఫిన్ ఏదైనా చెట్నీతోనే చిక్కు ఉంటుంది. పల్లీ రొటీన్ అంటారు. కొబ్బరి మళ్లీనా అంటారు. ఇడ్లీ దోశల్లోకి లాగించే కమ్మటి చెట్నీ చేసేద్దాం

కావాల్సిన పదార్థాలు

నూనె - 2 టేబుల్ స్పూన్స్
ధనియాలు – 2 టీ స్పూన్స్
ఆవాలు – 1/4టీ స్పూన్
జీలకర్ర - 1/2టీ స్పూన్
మెంతులు - 1/4టీ స్పూన్
ఎండుమిర్చి - 8
అల్లం – ఒక ఇంచ్
ఉల్లిపాయలు -3
టమాటాలు - 3
ఉప్పు - తగినంత
తాలింపు గింజలు – 1 టీ స్పూన్
వెల్లుల్లి రెమ్మలు -3
ఇంగువ - చిటికెడు
కరివేపాకు – ఒక రెమ్మ

తయరీ విధానం

1.స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టుకుని, రెండు టేబుల్ స్పూన్స్, ఆయిల్ వేసుకోవాలి.

2. ఆయిల్ వేడెక్కిన తర్వాత ధనియాలు,ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి, తుంచుకుని వేసుకోవాలి.

3. లో ఫ్లేమ్ లో దోరగా వేగనివ్వాలి

4. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి.

5. చిన్న అల్లం ముక్క వేసి, రెండు మూడు నిముషాలు వేగనివ్వాలి

6. ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేసుకుని, తగినంత ఉప్పు యాడ్ చేసుకుని, మూత పెట్టి,

మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడకనివ్వాలి

7. స్టవ్ ఆఫ్ చేసి మగ్గిన టమాటాలను చల్లారనివ్వాలి.

8. చల్లారిన మిశ్రమాన్ని,మిక్సీ జార్ లో వేసుకుని, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

9. తాళింపు కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని, ఆయిల్ వేసి, వేడెక్కిన తర్వాత తాళింపు గింజలు, వేసుకోవాలి.

10. అవి చిటపట లాడుతుండగా, వెల్లుల్లి రెమ్మలు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి

11. ఇప్పుడు అందులోనే చిటికెడు ఇంగువ, రెండు ఎండు మిరపకాయలు, కరివేపా వేసుకోవాలి.

12. వేగిన పోపును చెట్నీలో కలుపుకోవాలి. అంతే కమ్మటి టిఫిన్ చెట్నీ రెడీ
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top