Cabbage Manchurian:రెస్టారెంట్ స్టైల్లో క్యాబేజీ మంచూరియా.. ఇంట్లో ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

Cabbage Manchurian:ఇంట్లో ఫుడ్ బోర్ కొడితే, ఫాస్ట్ ఫుడ్ వైపు మనసు వెళ్తుంది. స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచివి కాదని తెల్సినా, తినాలనే ఆశ మాత్రం ఉంటుంది కదా.మరి ఫాస్ట్ ఫుడ్ ను ఫాస్ట్ గా ఇంట్లోనే తయారు చేస్తే ఎలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఏక్ ప్లేట్ క్యాబేజ్ మంచూరియా

కావాల్సిన పదార్థాలు

క్యాబేజీ – ఒక కప్పు (తురుము) టమాట -1
ఉప్పు – తగినంత
పసుపు – ¼ టీ స్పూన్
కారం - ½ టీ స్పూన్
ధనియాల పొడి - ½ టీ స్పూన్
మిరియాల పొడి – చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
మైదా – ½ కప్పు
కార్న్ ఫ్లోర్ – 3 టీ స్పూన్స్
వాటర్ – సరిపడా
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
పచ్చిమిర్చి- 2
ఉల్లిపాయ – 1
కరివేపాకు – రెండు రెమ్మలు
కశ్మీరి రెడ్ చిల్లీ -1 టీ స్పూన్
గరం మసాలా- ¼ టీ స్పూన్
నిమ్మరసం -
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ,చాప్ చేసుకున్న క్యాబేజీ తురుము వేసుకుని, ఉప్పు , పసుపు,కారం, ధనియాల పొడి, గరం మసాల,మిరియాల పొడి, అల్లం వెల్లుల్లిపేస్ట్, ½ కప్పు మైదా , కార్న్ ఫ్లోర్, వేసుకుని అన్ని కలిసేలా బాగా కలుపుకోండి.

2. కొద్దికొద్దిగా వాటర్ వేసుకుంటూ , చపాతి ముద్దలా కలుపుకోవాలి

3. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుని, చిన్న చిన్న బాల్స్ గా తయారు చేసుకోవాలి.

4. స్టవ్ పై బాండీ పెట్టుకుని, ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి.

5.తయారు చేసుకున్న బాల్స్ ను డీప్ ఫ్రై చేసుకోవాలి.

6.వేరొక కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, వేడెక్కాక, సన్నగా తరిగిన పచ్చిమిర్చి,

ఉల్లిపాయ తరుగు వేసుకుని, హై ఫ్లేమ్ లో వేయించుకోండి.

7. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పసుపు , కశ్మీరి రెడ్ చిల్లీ,

గరం మసాలా వేసుకుని పొడులు అన్ని కలిసేలా ఫ్రై చేసుకోవాలి.

8. ఒక మిక్సీ జార్ లో బాగా పండిన టమాటాను మెత్తని పేస్ట్ లా చేసుకుని, ఫ్రైలో కలపాలి.

9. కొంచం వాటర్ వేసుకుని, టమాటా పేస్ట్ దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి

10.ఆయిల్ సెపరేట్ అవుతున్న సమయంలో, కొద్దిగా కార్న్ ఫ్లోర్ పౌడర్ ను వాటర్ లోకలుపుకుని, టమాటా పేస్ట్ లోకి యాడ్ చేసుకోవాలి.

11. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వాటర్ దగ్గర పడేవరకు, బాగా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంచాలి.

10. ఇందులో ఫ్రై చేసుకున్న క్యాబేజీ బాల్స్ ను యాడ్ చేసుకుని,కొద్దిగా డ్రై అయ్యేవరకు కలపుకోవాలి.

11. చివరిగా కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసుకుని ప్లేట్ లోకి సెర్వ్ చేసుకుంటే వేడి వేడి క్యాబేజీ మంచురియా రెడీ
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top