Potato Garlic Balls: ఈవినింగ్ అయిందంటే చాలు, అమ్మా స్నాక్స్ అంటూ మొదలు పెడతారు పిల్లలు, రొటీన్ గా చేస్తే నచ్చదు. రోజూ కొత్తగా కావాలంటారు. పిల్లల కోసం ఆలు వెల్లుల్లి బోండా స్నాక్ ఐటెం ఎలా చేయాలో తెల్సుకుందాం
కావాల్సిన పదార్థాలు
బంగాళదుంపలు – 4
వెల్లుల్లి రెబ్బలు - 5
కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్స్
చిల్లీ ఫ్లెక్స్ – 1 టేబుల్ స్పూన్
ఓరిగానో - ½ టేబుల్ స్పూన్
బటర్ – 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి - ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
బ్రేడ్ క్రమ్స్ - 4 టేబుల్ స్పూన్స్
ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
1.ముందుగా బంగాళదుంపలు ఉడికించి మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి
2. ఇందులోకి దంచిన వెల్లుల్లి రెబ్బలు , కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి.
3. చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో , రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
4. ఇందులో బ్రెడ్ క్రమ్స్ వేసి గట్టిముద్దలా గా తయారు చేసుకోవాలి.
5.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి, వేడెక్కనివ్వాలి.
6.కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని, రెండు చేతులతో గుడ్రండి బాల్స్ గా చేసుకుని,
డీప్ ఫ్రై చేసుకోవాలి.
7. ఎర్రగా కాలిన బాల్స్ ను ప్లేట్ లోకి తీసుకుంటే , ఆలు వెల్లుల్లి బోండా రెడీ.