Alasanda Vadalu : మనం రెగ్యులర్ గా తీసుకొనే పప్పు దినుసుల్లో అలసందలు ఒకటి. వీటిని ఉడికించి తీసుకోవచ్చు. అలగే వీటితో వదలను వేసుకొని వేడివేడిగా తినవచ్చు. అలసందలలో మన శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఈ వడలను పిల్లలకు స్నాక్ గా పెట్టవచ్చు.
కావలసిన పదార్ధాలు
అలసందలు / బొబ్బర్లు 2 కప్పులు
అల్లం అంగుళం ముక్క
పచ్చిమిర్చి 2
కరివేపాకు
కొత్తిమీర
ఇంగువ
సరిపడా ఉప్పు
నూనె
తయారి విధానం
బొబ్బర్లను శుభ్రంగా కడిగి నీటిని పోసి మూడు గంటలు నానబెట్టాలి. మిక్సీ జార్ లో నానిన బొబ్బర్లు, అల్లం,పచ్చిమిర్చి,ఉప్పు వేసి బరకగా మిక్సీ చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో కరివేపాకు,కొత్తిమీర,ఇంగువ వేసి బాగా కలిపి వడలు మాదిరిగా వత్తి నూనెలో వేగించాలి. సాయంత్రం స్నాక్ గా ఈ వడలు బాగుంటాయి.